టి.నాగేందర్ దర్శకత్వంలో రోహిత్ హీరోగా జి.నరేశ్‌రెడ్డి నిర్మాణంలో హైదరాబాద్‌లోని విఠల్‌వాడి ఏరియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం విఠల్‌వాడి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన జగపతిబాబు హీరోగా పరిచయ మవుతున్న రోహిత్, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ఈ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. నిర్మాత మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి అన్నారు. చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. త్వరలో టీజర్ విడుదల చేస్తాం అని నిర్మాత నరేశ్‌రెడ్డి అన్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు నాగేందర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa