ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 04:19 PM

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి సరసన ‘జై భీమ్‌’ హీరోయిన్‌ లిజోమోల్‌ జోస్‌ నటించనున్నారు. బాలాజీ ధరణీధరన్‌ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే చెన్నైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా మలయాళ భామ లిజోమోల్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు అట్లీ తన సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కిస్తున్నారు. ‘నడువుల కొంజెం పక్కత్త కాణోం’, ‘సీతక్కాది’ వంటి చిత్రాల తర్వాత విజయ్‌ సేతుపతి - దర్శకుడు బాలాజీ కాంబోలో రానున్న మూడో చిత్రం. టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa