భూతకోళ అంటూ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో కన్నడ నుంచి మరో చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ సాపల్య నిర్మాత. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల మంగళూరులో ఆడియో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించడం, కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ ' మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. అందరినీ సర్ ప్రైజ్ చేసేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa