బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వార్. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్స్ మరియు ట్రైలర్ మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇద్దరు భారత ఏజెంట్స్ మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ ని పోర్చుగల్ దేశంలోని పోర్టు బ్రిడ్జి పై చిత్రీకరించడం జరిగింది. 300అడుగుల ఎతైన ఆ బ్రిడ్జి పై నుండి హృతిక్ డూపు లేకుండా దుకారట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు స్వయంగా తెలియయజేశారు. తమ అభిమానులకు ఏదైనా కొత్తగా చూపించాలని ఎప్పుడూ తపించే హృతిక్ ఇలాంటి రిస్క్ తీసుకుంటూ ఉంటారు అన్నారు ఆయన. వార్ చిత్రంలో హీరోయిన్ గా వాణి కపూర్ నటిస్తుండగా, విశాల్-శేఖర్, సంచిత్ బల్హార సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa