ఆది సాయి కుమార్ కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాల దర్శకుడు సాయి కుమార్ అడివి దర్శకత్వంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన శషా చెట్రీ కథానాయికగా నటిస్తోంది. కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేష్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత కథతో తెరెక్కించారు. ఈ మూవీలో ఆది సాయికుమార్ అర్జున్ పండిత్ అనే ఎన్.ఎస్.జి కమాండో రోల్లో నటించాడు. ఎన్.ఎస్.జి కమెండోగా ఆది లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ మూవీ కోసం ఆది..స్పెషల్‌గా ఆర్మీ, ఎన్.ఎస్.జీ వాళ్ల స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అంతేకాదు ఈ మూవీలో ఎలాంటి డూపు లేకుండా ఎన్నో రిస్కీ షాట్స్ చేేసినట్టి సమాచారం. ఈ సినిమాలో ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి నటించాడు. ఫరూఖ్ ఇక్బాల్ ఇరాకీగా మనోజ్ నందం, ఇంకా కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన దేశభక్తి గీతాన్ని కీరవాణి పాటడం విశేషం. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈసినిమాను అక్టోబర్ 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa