హాలీవుడ్ యాక్షన్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'టెర్మినేటర్' అభిమానులకు దర్శకుడు జేమ్స్ కామెరాన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఫ్రాంచైజీలో రాబోయే తర్వాతి సినిమాలో ఐకానిక్ హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ కనిపించబోరని ఆయన స్పష్టం చేశారు. ఇకపై కొత్త తరం పాత్రలతో ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని కామెరాన్ అభిప్రాయపడ్డారు.ఈ విషయంపై హాలీవుడ్ రిపోర్టర్‌తో మాట్లాడుతూ, "తర్వాతి సినిమాలో ఆర్నాల్డ్ ఉండరని నేను కచ్చితంగా చెప్పగలను. 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' చిత్రంలో T-800 పాత్రకు గొప్ప ముగింపు ఇచ్చామని నేను భావిస్తున్నాను. ఇకపై కొత్త తరం పాత్రలు రావాలి. టైమ్ వార్, సూపర్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను మరింత విస్తృతంగా చూపించాలనుకుంటున్నాను" అని కామెరాన్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa