స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ రేపు ఉదయం పది గంటలకు విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారట. ఇక జూలై 8న దసరా స్పెషల్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa