ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న’సైరా’ విడుదలకు ఇంకో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభిమానులు స్పెషల్ షోస్ ఎక్కడెక్కడ వేస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు చాలా చోట్ల వేకువజామున 3 గంటల నుండే స్పెషల్ షోలు వేస్తారని తెలుస్తోంది. అంతేగాక అదనపు షోస్ వేయడానికి అనుమతులు కూడా తీసుకుంటున్నారట. అంటే రోజుకు ఐదు షోల చొప్పున చిత్రం ప్రదర్శితం కానుంది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకల్లో దాదాపు అన్ని చోట్ల ఈ షోస్ ఉండనున్నాయి. చిత్రానికున్న డిమాండ్, హైప్ రీత్యా ప్రభుత్వం కూడా స్పెషల్, అదనపు షోలకు అనుమతులిచ్చే అవకాశం ఉంది. ఈ షోస్ ద్వారా చిత్ర ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండనున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రూ.270 కోట్ల వ్యయంతో రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa