తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని సామాజిక అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన చిత్రం 'దండోరా'. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రం యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది."మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు.." అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఊరి బయట శవాన్ని మోసుకెళ్తున్న దృశ్యాలు కథలోని తీవ్రతను, సామాజిక కోణాన్ని తెలియజేస్తున్నాయి. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు.శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందుమాధవి, మౌనికా రెడ్డి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం. విదేశాల్లో కూడా సుమారు 200కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించనుండగా, ఈ నెల 23నే అక్కడ ప్రీమియర్ షోలు వేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa