ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హ్యాపీ రాజ్' చిత్రంతో మరోసారి వెండితెరపైకి అబ్బాస్

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 02:15 PM

'ప్రేమదేశం' చిత్రంతో తెలుగు యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు అబ్బాస్ వెండితెరపైకి పునరాగమనం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం 'హ్యాపీ రాజ్'. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రచార చిత్రాన్ని (ప్రోమో) మేకర్స్ విడుదల చేశారు.దక్షిణాది భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన అబ్బాస్, కెరీర్ మంచి దశలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'హ్యాపీ రాజ్' సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, గీతా కైలాసం, జార్జ్ మరియన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.మరియా రాజా ఎలాంచెళియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa