షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి, డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్, ఇటీవల పవన్ కళ్యాణ్ తో తీసిన 'ఓజీ' సినిమాతో భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వచ్చే సీన్ 16 ఏళ్ల క్రితం తాను తీసిన ఓ షార్ట్ ఫిలిం లోని షాట్ ను పోలి ఉందని, అప్పుడు దానికి పెద్దగా గుర్తింపు రాలేదని, కానీ స్టార్ హీరోతో తీయడం వల్ల ఇప్పుడు అది వైరల్ అయిందని సుజీత్ తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa