ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి హీరోగా 'బెగ్గర్' సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు పూరి జగన్నాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాతో పూరి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది టీజర్ విడుదల తర్వాత స్పష్టమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa