మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి ని రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా 280కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐదు ప్రధాన భాషలలో ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. కాగా జార్జియా లో చిత్రీకరించిన ఒక్క వార్ ఎపిసోడ్ కొరకు 75కోట్ల బడ్జెట్ కేటాయించిన చిత్ర బృందం ఈ మూవీ లో ప్రతి సన్నివేశం కొరకు రాజీపడకుండా నిర్మిచారని సమాచారం. అలాగే సైరా మూవీలో జాతర నేపథ్యంలో వచ్చే ఓ పాట కొరకు ఏకంగా 4500మంది డాన్సర్స్ తో 14రోజుల పాటు చిత్రీకరించారట. ఇప్పటివరకు అత్యధిక డాన్సర్స్ పాల్గొన్న పాటగా సైరా లోని ఈ పాట నిలిచిపోతుందని సమాచారం. చిరంజీవి కి జంటగా నయనతార, తమన్నా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa