నందమూరి బాలకృష్ణ కెరీర్ నాలుగు దశాబ్దాలు దాటినా జోరు తగ్గలేదు. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినా, ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, నయనతార అధిక రెమ్యునరేషన్ దీనికి కారణమని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa