నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా` సినిమా తర్వాత బన్నీ హీరోగా నటిస్తోన్న చిత్రం `అల.. వైకుంఠపురములో..`. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలు. సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విజువల్ టైటిల్ ప్రొమో, పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సాంగ్‌కు సంబంధించిన `సామజవరగమన.. ` అనే సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా విషయంలో సెంటిమెంట్‌గా కూడా యూనిట్ కాంప్రమైజ్ కావాలనుకోవడం లేదు. అందుకు ఉదాహరణగా ఈ సినిమా ఇంగ్లీష్ టైటిల్‌లో చిన్న మార్పు కనపడింది. ఇది వరకు సినిమా ఇంగ్లీష్ టైటిల్‌ను ala vaikuntapuramulo గా పెట్టారు. అయితే ఇప్పుడు సాంగ్ ప్రొమో విడుదల సమయంలో దీన్ని ala vaikuntapurramuloo గా మార్చారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. జయరాం, మురళీశర్మ తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. కోటీశ్వరుడు, పేదవాడు స్థానాలు తారుమారైతే వచ్చే మార్పులను ఆధారంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. ఆలా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa