ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర టికెట్ ధరలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:40 AM

చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. సినిమా విడుదల సందర్భంగా పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరల గడువు ముగియడంతో, నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు పది రోజుల పాటు అనుమతినిచ్చాయి. ఆ గడువు తాజాగా పూర్తి కావడంతో, ఇకపై మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో రెగ్యులర్ ధరలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు టికెట్ ధరలు తగ్గడంతో సినిమాకు ప్రేక్షకాదరణ మరింత పెరుగుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa