ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవడం గర్వంగా ఉంది: నటి భూమిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 02:00 PM

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'యుఫోరియా' సినిమా పాట విడుదల కార్యక్రమం వైజాగ్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'యుఫోరియా'లో కీలక పాత్ర పోషించిన భూమిక, ఈ సినిమా తన కెరీర్‌లో టాప్‌లో నిలుస్తుందని, ఇది తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. తనతో 'ఖుషి' సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయినందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాను పిల్లల తల్లిదండ్రులు కనెక్ట్ అయ్యి చూస్తారని, థియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మంచి ఆలోచనతో ఉంటారని భూమిక తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa