విష్ణు హీరోగా నటిస్తోన్న హాలీవుడ్ చిత్రాన్ని జెఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ లో ప్రధాన భాగం ఇప్పటికే పూర్తయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. బాలీవుడ్ మాజీ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటివలే చిత్రబృందం సునీల్ ను అప్రోచ్ అవ్వగా.. వేంటనే సునీల్ ఒకే చెప్పాడట. త్వరలో హైదరాబాద్ లో జరిగే షూట్ లో సునీల్ జాయిన్ కానున్నారు. ఒకేసారి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో విష్ణు మంచుతో పాటు హీరోయిన్ కాజల్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా కోసం విష్ణు సతీమణి విరానికా నిర్మాతగా మారారు. వయా మార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఈ చిత్రంలో నటించనున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణు మొత్తానికి కెరీర్ ను పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa