సినిమాలు ప్లాప్ అయితే నటీనటులపై విమర్శలు, ట్రోలింగ్ సహజం. అయితే బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ 'ది రాయల్స్' సిరీస్ పై వచ్చిన విమర్శల వల్ల తొమ్మిది నెలల పాటు మానసికంగా కుంగిపోయినట్లు స్వయంగా వెల్లడించారు. ఈ సిరీస్ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. విమర్శల కారణంగా నటిగా, వ్యక్తిగా తనను తాను మర్చిపోయానని, కెరీర్ లో ఇలా గ్యాప్ తీసుకోవడం ఇదే మొదటిసారని, ఈ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ప్రయాణాలు చేయడం వంటివి చేశానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa