అరుదైన జన్యు వ్యాధితో చావుబతుకుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను నటి శృతి హాసన్ కాపాడారు. ‘ఆళ్వి’ అనే చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే అరుదైన వ్యాధి ఉండగా, 2025లో ఎముక మజ్జ మార్పిడి అవసరమైంది. ఆ సమయంలో శృతి హాసన్ బాధిత కుటుంబానికి ఆర్థికంగా మాత్రమే కాకుండా వైద్యపరంగా కూడా అండగా నిలిచారు. ప్రముఖ వైద్యులను పరిచయం చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకోవడంతో కుటుంబ సభ్యులు శృతికి కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల ఆ చిన్నారి ఆళ్వి తన పేరెంట్స్‌తో కలిసి శృతిని కలిసింది. ఆ సమయంలో శృతి ఆ పాపతో ఆడుకుంటున్న వీడియో చూస్తుంటే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. “మా పాప ఈరోజు బతికి ఉందంటే అది కేవలం శృతి గారి వల్లే” అంటూ ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. శృతి ఆ పాప కోసం ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇస్తూ, తన సొంత ఇంటి మనిషిలా ఆదరించిందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa