ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వారణాసి' ఒక పార్ట్ గానే విడుదల చేస్తాం

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 04:06 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఎంతో ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి చెక్ పెట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... రెండు భాగాలుగా సినిమాను నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ... చివరకు ఒక పార్ట్ గానే విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండవచ్చని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో 'రుద్ర' అనే పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పూర్తి స్థాయి ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించబోతోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa