ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్స్ ఎంతో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 08:05 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. . మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్‌ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్‌ వీక్‌లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్‌టైమ్‌ రీజనల్‌ ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు.  ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత  అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్‌లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.ఓవర్సీస్‌లో  కూడా  ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్‌లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ రికార్డు నెలకొల్పింది.  ఆపై బుక్‌మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa