ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన మాట వింటే ఇలా ఉండేవాడిని కాదు: అర్జున్ సర్జా

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 03:49 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక మోసాలకు గురైనట్లు వెల్లడించారు. తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఆయన దర్శకత్వం వహించిన 'సీత పయనం' చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చిన్న వయసులోనే డబ్బు సంపాదించినా, సరైన పెట్టుబడులు పెట్టలేకపోయానని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నటుడు శోభన్ బాబు పెట్టుబడుల విషయంలో హెచ్చరించినా వినలేదని, నాతో ఆయన చాలా క్లోజ్‌గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో  ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్‌ గుర్తు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa