ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 06:32 PM

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ ఓటీటీలోకి రానుంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఈ నెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే రోజున చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ జీ5లో విడుదల కానుంది. ఇకపోతే ప్రభాస్ ‘రాజాసాబ్’ హాట్‌స్టార్‌లో, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రైమ్ వీడియోలో, ‘ధురంధర్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.మారి(maari) ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ హీరోగా, మీనాక్షి చౌద‌రి(Meenakshi chaudhary) హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ టాక్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలవ‌గా, ఇప్పుడీ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకుని ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa