ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళయరాజా బయోపిక్‌ పై క్లారిటీ ఇచ్చిన ధనుష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:22 PM

సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ నుంచి దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తప్పుకున్నారని, ఈ క్రమంలో  ఆయన స్థానంలో మరొకరు ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్‌ వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై ధనుష్ టీమ్ స్పందించి స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అరుణ్ తెరకెక్కిస్తున్న ‘డీసీ’ సినిమా పూర్తవ్వగానే, ఆయన మళ్లీ ఇళయరాజా బయోపిక్‌ షూటింగ్‌ను పునఃప్రారంభిస్తారని ధనుష్ టీమ్ వెల్లడించింది. ధనుష్ ప్రధాన పాత్రలో ఇప్పటికే ఈ బయోపిక్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ ‘డీసీ’ సినిమాను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ ఇక ఇళయరాజా బయోపిక్‌కు దర్శకత్వం వహించట్లేదంటూ పుకార్లు షికారు చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa