రజనీకాంత్‌తో తనకున్న ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని నటి రాధికా శరత్‌కుమార్ పంచుకున్నారు. ఆ జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ... ఒక రాత్రి తాను, రజనీకాంత్ ఇద్దరూ చెన్నైలో బైక్‌పై తిరుగుతూ ఉండగా, రజనీ తన సినీ ప్రయాణం ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారని తెలిపారు. “నేను ఇక్కడే పడుకునేవాడిని. ఈ హోటల్‌లోనే తినేవాడిని. ఆ రోజుల్లో ఇక్కడే ఉండేవాడిని” అంటూ భావోద్వేగంతో ఆ ప్రదేశాలను రజనీ తనకు చూపించారని వెల్లడించారు. ఆ సమయంలో రజనీ ఎంతో ఎమోషనల్ అయ్యారని గుర్తు చేసుకున్నారు.అయితే, ఆ ఎమోషనల్ రైడ్ మధ్యలో ఒక అనూహ్య సంఘటన జరిగిందట. తాము బైక్ పై వెళ్తుండగా... ఒక్కసారిగా ఒక కారు వేగంగా వచ్చి తమ ముందు ఆగిపోయిందని, దీంతో ఇద్దరం భయపడిపోయామని తెలిపారు. ఆ కారులో నుంచి దిగింది మరెవరో కాదు... రజనీకాంత్ భార్య లత సోదరుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర అట. నిజానికి రజనీకాంత్, రాధిక కలిసి బయటకు వెళుతున్న విషయం లతకు తెలుసు. కానీ రవి రాఘవేంద్రకు ఆ విషయం తెలియదట. అందుకే ఆయన అపార్థం చేసుకుని తమను వెంబడించి అడ్డుకున్నారని రాధిక నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. తీరా బైక్‌పై ఉన్నది రాధిక అని తెలిసి రవి ఆశ్చర్యపోయారట. ఆ చిన్న అపార్థం ఆ సమయంలో కాస్త టెన్షన్ సృష్టించినా... చివరికు అది ఒక ఫన్నీ మూమెంట్‌గా మారిపోయిందని ఆమె చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa