ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్తిబన్ ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 10:54 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం నుంచి నటుడు పార్తిబన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన నల్ల నాగప్ప అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 'గబ్బర్ సింగ్' కాంబో అయిన పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఈ క్రేజీ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదలైన నల్ల నాగప్ప పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్‌లో పార్థిబన్ ఎంతో భ‌యాన‌కంగా, పవర్‌ఫుల్ లుక్‌లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ‘నల్ల నాగప్ప’. రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్న పార్థిబన్ పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే సంకేతాలు ఫస్ట్ లుక్ నుంచే స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ -పార్థిబన్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేశారో చూడాలని అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించగా, త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథన రచన బాధ్యతలను దర్శకుడు దశరథ్ నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa