విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వీడియో కోసం ఒక ప్రముఖ OTT సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను దృష్టిలో పెట్టుకుని ఈ జంట జాగ్రత్త పడుతోందట. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకను ఇలా వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్లు కుమ్మరిస్తామన్నా సరే ఆ OTT డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ గా ఉంచుకోవాలని ఈ క్రేజీ కపుల్ భావిస్తున్నారట. నయనతార - ధనుష్ వివాదం తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోల విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa