'అందాల రాక్షసి' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తక్కువ సమయంలోనే టాలెంటెడ్ హీరోయిన్ గా నిరూపించుకుంది. వరుస చిత్రాలలో నటిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. ఇదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో పడింది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలిగా వారి ఇంట అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా నటనపై ఆసక్తితో ఆమె నటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం 'సతీ లీలావతి' అనే చిత్రంలో లావణ్య నటిస్తోంది. మార్చి 6న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనని ట్రోలర్స్ ను హెచ్చరించింది. చిరంజీవి గారు ఇంట్లో ఎలా ఉంటారో తమకు తెలుసని... తమ కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లని ఎంత ప్రేమగా చూసుకుంటారో విమర్శలు చేసేవారికి అసలు తెలియదని అన్నారు. ఆయన చేసే పనుల్లో ఒక శాతం కూడా చేయలేని వాళ్లు... ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa