పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అనే ప్రశ్నలు గత కొంత కాలంగా ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు ఈ చర్చలో టాలెంటెడ్ హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా డెబ్యూ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది.అకీరాతో శేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఈ వార్తలకు బలం ఇస్తోంది. ముఖ్యంగా ‘రైటర్స్ బ్లాక్’ షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అడివి శేష్... అకీరా కోసం ప్రత్యేకమైన, వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో శేష్ దర్శకత్వం వహిస్తారా? లేక కేవలం కథ అందిస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa