ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో అందుబాటులో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కొహ్రా' సీజన్ 2

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 01:01 PM

హిందీలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కొహ్రా'. 2023 - జులైలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ కి అనూహ్యమైన ఆదరణ లభించింది. అలాంటి  ఈ సిరీస్ నుంచి సీజన్ 2 వచ్చింది. ఈ నెల 11వ తేదీ నుంచి 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. సుదీప్ శర్మ - ఫైజల్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, మోనా సింగ్ - బరున్ సోబ్తి ప్రధానమైన పాత్రలను పోషించారు. తెలుగులోను అందుబాటులోకి వచ్చిన సిరీస్ ఇది.ప్రీత్ బాజ్వా(పూజ) తన భర్త శ్యామ్ ( రణ్ విజయ్ సింఘా) తో కలిసి అమెరికాలో నివసిస్తూ ఉంటుంది.  వారికి ఇద్దరు పిల్లలు. శ్యామ్ కి 'లవ్లీన్'తో అక్రమ్ సంబంధం ఉందనే విషయాన్ని గ్రహించిన ప్రీత్, భర్తతో పాటు పిల్లలను కూడా వదిలేసి, కోపంతో పంజాబ్ లోని తన పుట్టింటికి వచ్చేస్తుంది. ఆమె అన్నయ్య బల్జీత్ సింగ్ - వదిన ట్వింకిల్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉంటారు. పుట్టింటి ఆస్తిలో తనకి రావాల్సిన వాటా కోసం ఆమె బల్జీత్ తో గొడవపడుతూ ఉంటుంది. తనకి మెహర్ వర్మతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని బయటపెట్టిన చెల్లెలు ప్రీత్ పై బల్జీత్ కోపంతో ఉంటాడు. ఆమెకి జాన్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ట్వింకిల్ కి చెందవలసిన ఆస్తి అటు ప్రీత్ కి .. ఇటు మెహర్ కి దక్కకుండా ట్వింకిల్ సోదరుడైన కరంజ్యోత్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రీత్ దారుణంగా హత్య చేయబడుతుంది.ఈ కేసును పరిష్కరించడానికి ధనవత్ కౌర్ (మోనా సింగ్) అమ్రపాల్ (బరున్ సోబ్తి) రంగంలోకి దిగుతారు. అయితే నిజానికీ ఈ ఇద్దరికీ వారి ఫ్యామిలీ వైపు నుంచి మనఃశాంతి ఉండదు. పెళ్లీడు కొచ్చిన కొడుకును పోగొట్టుకుని ధనవత్ దంపతులు నిర్జీవంగా బ్రతుకుతూ ఉంటారు. తన జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెట్టిన సిల్కీ కి సంతోష పెట్టలేక అమ్రపాల్ బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రీత్ కేసు విషయాల్లో మిస్టరీని ఛేదించడానికి వారు సిద్ధమవుతారు. ప్రీత్ హత్యకి కారకుడు ఆమె భర్తనా? ఆమెతో సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చిన జాన్ కారణమా? ఆస్తిలో వాటా అడుగుతుందని ఆగ్రహించిన సోదరుడు బల్జీత్ నా? తన అక్క ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుందని భావించిన ట్వింకిల్ సోదరుడు కరణ్ జోత్ నా? లేదంటే వేరెవరైనానా? అనేది కథ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa