ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 21న విడుదల తేదీని ఖరారు చేసిన 'ది ప్యారడైజ్' చిత్రబృందం

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 01:09 PM

నాని కథానాయకుడిగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. ఇందులో నాని 'జడల్' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన మార్చి 26కు బదులుగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నాని తన 'ఎక్స్' ఖాతాలో కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ "2026 ఆగస్టు 21 #JadalZamanaFromAug21 #TheParadise" అని పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa