ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు జో సైమన్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 02:31 PM

ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) బెంగళూరులో కన్నుమూశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ‘సాహస సింహ, స్నేహదా కదకల్లి’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. జో సైమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.1946లో మండ్యలో జన్మించిన జో సైమన్, 1967లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా 100కు పైగా చిత్రాల్లో పనిచేశారు. 'సాహస సింహ', 'సింహ జోడి', 'హాంగ్ కాంగ్ నల్లి ఏజెంట్ అమర్', 'స్నేహద కడలలి', 'రవివర్మ', 'మహా ప్రచండరు' మరియు 'టైం బాంబ్' వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన రూపొందించారు. దివంగత లెజెండరీ నటులు విష్ణువర్ధన్ , అంబరీష్‌లతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. రవి వర్మ, మణి, టైమ్‌ బాంబ్‌ వంటి సినిమాల్లో సైమన్‌ నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa