ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ధురంధర్‌’ మూవీ షూటింగ్‌పై బ్యాన్‌!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 12:19 PM

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ముంబయిలో ఈ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసింది. భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు బీ62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. ఈ నిర్ణయంతో చిత్రం నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.. అంతేకాకుండా దీనిపై శాశ్వతంగా బ్యాన్‌ విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. గతంలో షూటింగ్‌ నిర్వహించిన సమయంలో టీమ్‌ నిబంధనలను ఉల్లంఘించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేషన్‌ వెల్లడించింది. ముంబయిలోని పలు వీధుల్లో ఇటీవల దీని షూటింగ్‌ జరిగిందని ఆ సమయంలో క్రాకర్లు, మండే పదార్థాలు ఉపయోగించారని అది షరతులను ఉల్లంఘించినట్లేనని అధికారులు పేర్కొన్నారు. ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ధురంధర్‌’. గతేడాది చివర్లో విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్‌:ది రివెంజ్‌’  రానుంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa