బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, జోర్డాన్ రాణి రానియా అల్ అబ్దుల్లాతో ముంబైలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈషా అంబానీ ఆతిథ్యంలో నగరంలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో (ఎన్ఎంఏసీసీ) ఈ కార్యక్రమం జరిగింది. 'సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్ లీడర్‌షిప్ ఇన్ ఇండియా' పేరుతో జరిగిన ఈ ప్రైవేట్ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు పాలుపంచుకున్నారు.ఈ సమావేశంపై కరిష్మా కపూర్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఇంతటి స్ఫూర్తిదాయకమైన మహిళలతో కలిసి, గౌరవనీయులైన జోర్డాన్ రాణి సమక్షంలో మహిళా సాధికారత, నాయకత్వం, భవిష్యత్తుపై జరిగిన చర్చలో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం, అదృష్టం" అని ఆమె పేర్కొన్నారు. "లక్ష్యం, నిజాయతీ, దార్శనికతతో మహిళలు ఏకమైతే, వారు కేవలం సంభాషణలకే పరిమితం కారని, భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని" కరిష్మా తెలిపారు.ఈ ప్రత్యేక సమావేశంలో కరిష్మాతో పాటు పారిశ్రామికవేత్త నవ్య నవేలీ నందా, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa