ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఇకపై నేను కేవలం నటనపైనే పూర్తి ద‌‌‌ృష్టి : మంచు లక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 12:40 PM

టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తన నిర్మాణ రంగ ప్రస్థానానికి ముగింపు పలికినట్లు తెలిపారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా వల్ల వచ్చిన నష్టాలు, అప్పులు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని, అందుకే ఇకపై కేవలం నటనపైనే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమా వల్ల వచ్చిన అప్పులను నేను ఇప్పటికీ కట్టుకుంటూనే ఉన్నాను. అందుకే ఇకపై నేను కేవలం నటనపైనే పూర్తి ద‌‌‌ృష్టి పెట్టలనుకుంటున్న. అంతే కానీ మళ్ళీ సినిమాలు నిర్మించే సాహసం మాత్రం చేయను. అందుకే ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు స్క్రిప్ట్ పట్టుకొని వస్తే, ముందుగా “నిర్మాత ఎవరు?” అని అడుగుతున్నా, నిర్మాత ఉన్నప్పుడే నాతో మాట్లాడమని చెప్తున్నా’అని ఆమె తెలిపారు. అంటే ఒక సినిమా ఫెయిల్యూర్ ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని ఎలా దెబ్బతీస్తుందో మంచు లక్ష్మి మాటలో స్పష్టంగా తెలుస్తోంది . ప్రస్తుతం ఆమె ఇతర భాషా చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa