టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి... పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది.హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa