తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా, బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. 2019లో 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా, అక్కడివారు తనను ఒక నటిగా కాకుండా 'సౌత్ నుంచి వచ్చిన అమ్మాయి'గానే చూశారని, హిందీ రాదనే అపోహతో చిన్నచూపు చూశారని, ఇది తనను ఎంతో బాధించిందని తెలిపింది. అయితే కొందరు ప్రొఫెషనల్ దర్శకులు, నటుల వల్ల ఆ కష్టమైన దశను దాటగలిగానని ఆమె పేర్కొంది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ కల్చర్ మీద ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. రెజీనా అక్కడి ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఇప్పటికీ వేచి చూస్తూనే ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ వంటి హిందీ ప్రాజెక్టులతో ఆమె బిజీగానే ఉంది. మరోవైపు తమిళంలోనూ అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ఆమె కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. ఇక్కడ రెజీనా కనిపించి చాలా రోజులైపోయింది.. ఇంకా చెప్పాలంటే ఏళ్ళైపోయింది. విలన్‌గానూ నటించినా అవకాశాలు మాత్రం రావట్లేదు రెజీనాకు. అందుకే పక్క ఇండస్ట్రీల్లోనే అవకాశాల కోసం చూస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో నటిస్తూ.. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి నెరరేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa