ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 02:59 PM

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం 4:30 గంటలకు కొడవ సంప్రదాయంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.ఆత్మీయతల మేళవింపుగా జరిగిన ఈ పెళ్లి ఏర్పాట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో #ViRoshWedding హ్యాష్‌ట్యాగ్‌తో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.విజయ్–రష్మికల పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ క్లబ్‌లు ప్రత్యేక పోస్టర్లతో ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. “విరోష్” పేరుతో ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైంది. ఏడేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారనే భావనతో అభిమానులు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. ఆసక్తికరంగా, వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఏడేళ్లే కావడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa