ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్-రష్మిక పెళ్లి ఫొటోలు వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 07:38 PM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నా ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో గురువారం ఉదయం వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. తాజాగా పెళ్లి ఫొటోలను రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ సైతం పెళ్లి ఫొటోలను SMలో షేర్ చేశారు. దీంతో అభిమానులు విరోష్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన ఈ జోడీ ఇప్పుడు రియల్ లైఫ్ లో తొలి అడుగు మొదలు పెట్టారు. ప్రేమించుకున్నన్ని రోజులు విజయ్, రష్మిక ఎప్పుడూ తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.నేడు ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం వైభవంగా ఉదయ్ పూర్ లో జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ తొలిసారి మ్యారేజ్ ఫోటోలు షేర్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు.విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. వీరిద్దరినీ జంటగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.విజయ్ దేవరకొండ పంచె కట్టులో కనిపిస్తున్నాడు. రష్మిక ఆరెంజ్ కలర్ పట్టు చీర ధరించి, ఆభరణాలు పెట్టుకుని దేవతలా వెలిగిపోతోంది. ఆమె బ్రైడల్ అద్భుతంగా ఉంది.


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa