టాలీవుడ్‌లో మోస్ట్ అడ్మైర్డ్ కపుల్‌గా గుర్తింపు పొందిన Vijay Deverakonda – Rashmika Mandanna ఎట్టకేలకు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లిపై సాగుతున్న ప్రచారానికి తెరదిస్తూ ఈ జంట అధికారికంగా ఒక్కటైంది.ఈ ఉదయం రాజస్థాన్‌లోని Udaipurలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసినట్లు సమాచారం.హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రాజభవనంలో నిర్వహించిన ఈ వేడుకలో వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అనంతరం రష్మిక స్వస్థలం అయిన కర్ణాటకలోని కొడగు ప్రాంత సంప్రదాయాల ప్రకారం కూడా మరోసారి వివాహ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా పిలిచే ‘విరోషి’ (ViRo-shi) పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, “హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న రిలేషన్‌షిప్ రూమర్లకు ఆమె స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టినట్టైంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా వేదికగా వివాహ చిత్రాలను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa