ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ ‘పెద్ది’ రన్ టైంపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 02:52 PM

రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా రన్ టైం గురించి మూవీ టీం క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో 3-4 గంటలకుపైగా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, చిత్ర పీఆర్ వర్గాలు ఇవన్నీ ఊహాగానాలే అని తేల్చి చెప్పాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని, దర్శకుడు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా, మంచి ప్లాన్‌తో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంట, ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa