బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు షారుఖ్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌లతో హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ సంప్రదాయబద్ధమైన తెలుపు-క్రీమ్ కలర్ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాగ.. ఆయన భార్య గౌరీ ఖాన్ మస్టర్డ్ కలర్ ఎంబ్రాయిడరీ చీరలో మెరిసిపోయింది. ఇక కుమార్తె సుహానా ఖాన్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగా, నెక్లెస్‌తో పెళ్లి వేడుకకు నిండుదనాన్ని తీసుకువచ్చింది. ఈ స్టార్ ఫ్యామిలీ వేదిక వద్దకు చేరుకోగానే కెమెరా కళ్లు వారిపైనే నిలిచాయి. షారుఖ్ తనదైన శైలిలో అతిథులను పలకరిస్తూ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ కుటుంబంతో షారుఖ్‌కు ఉన్న దశాబ్దాల అనుబంధం నేపథ్యంలో, ఈ వివాహానికి ఆయన హాజరుకావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ వేడుకకు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దంపతులు అభిషేక్ బచ్చన్ దంపతులు, క్రికెటర్ ధోని దంపతులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa