కంచె చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రగ్యా జైస్వాల్‌కు ఇప్పుడు అవకాశాల లేమి టెన్షన్‌కు గురిచేస్తోందట. కంచె చిత్రం ఇచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత వెంట వెంటనే ఆమెకు పలు అవకాశాలొచ్చాయి. గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర…వంటి పలు చిత్రాలలో ఆమె నటించింది. అయితే అవేవీ ఆమె కెరీర్‌ను వేగవంతం చేయలేకపోవడమే కాదు అసలు అవకాశాలే దరి చేరకుండా చేశాయని అంటున్నారు. గ్లామర్‌కు గ్లామర్, అభినయానికి అభినయం ప్రదర్శించగల సత్తా ఉన్న తనకు అవకాశాలు రాకపోవడంలో ఆంతర్యం ఆమెకు బోధపడటం లేదట. కెరీర్ ఆరంభంలో తమిళంలో ఓ చిత్రం, హిందీలో ఓ చిత్రం చేసిన తర్వాతనే ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు తెలుగు చిత్రసీమలోనే కాదు తమిళ, హిందీ భాషల సినీరంగాలలో కూడా తనకు అవకాశాలు రాకపోవడం ఆమెను ఆలోచనకు గురి చేసిందట. దీంతో ఇప్పుడు తన గ్లామర్ మరింత ద్విగుణీకృతమయ్యే ఫ్యాషన్ దుస్తులతో ఫోటో సెషన్స్ చేస్తూ చిత్ర పరిశ్రమలు మళ్లిd తనను గుర్తు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Calm before the storm!!
Moments before going on stage for my performance last week for #Cinemahotsavam in Hyderabad..#FlashbackFriday pic.twitter.com/5oB3mFB5V6
— Pragya Jaiswal (@ItsMePragya) September 20, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa