ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2019, 08:43 AM

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.


అనంతరం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ ‘‘మాది క్రాస్ జోనర్ ఫిల్మ్. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్.  ఈ సినిమా ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచారు. బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. కశ్మీర్‌ నుండి ఇతర ప్రాంతాలకు వచ్చి సెటిలైన కశ్మీర్‌ పండిట్స్‌తో కూర్చుని, వాళ్లతో మాట్లాడి… అసలేం జరిగింది? అని సమస్య లోతుల్లోకి వెళ్లి, కంప్లీట్‌ రీసెర్చ్‌ చేసి అబ్బూరి రవి స్ర్కిప్ట్‌ రాశారు. రామజోగయ్య శాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం, ఇంకా శ‌షా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa