ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ బిగ్‌బాస్ చిచ్చుపెట్టాడు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2019, 02:05 PM

బిగ్‌బాస్.. హౌస్‌లో కంటెస్టెంట్లను ఊరికే ఉండనివ్వడు. టాస్క్‌ల పేరిట గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. వారిని ఇరకాటంలో పడేసి వారిలోని నిజ స్వరూపాన్ని బయటకు తెచ్చేందుకు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అయితే ఒక్కోసారే తానే స్వయంగా రంగంలోకి చిచ్చులు పెడుతూ ఉంటాడు.హౌస్‌మేట్స్.. మిగతా కంటెస్టెంట్ల గురించి మాట్లాడిన విషయాలను, తమ గురించి వెనకాల మాట్లాడుకునే సంగతులను కంటెస్టెంట్ల వినిపిస్తాడు, చూపిస్తాడు. తాజాగా ఇలాంటి ఫిట్టింగ్స్‌నే బిగ్‌బాస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇంతకు ముందే.. ఇలాంటి చిచ్చును శ్రీముఖి, వితికాకు.. పునర్నవి, వితికాకు పెట్టాడు. దీంతో పునర్నవి.. వితికాపై అలిగిన సంగతి అందరికీ తెలిసిందే.


దసరా వేడుకలను సందడిగా జరుపుకున్న బిగ్‌బాస్.. వెంటనే ఓ టాస్క్ ఇచ్చి గొడవలు పెట్టేందుకు సిద్దమయ్యాడు. దీనిలో భాగంగా.. అలీ తన గురించి మాట్లాడిని మాటలను బాబాకు వినిపించాడు. మహేష్ తన గురించి వెనకాల మాట్లాడిని సంగతులను శ్రీముఖికి తెలిసేలా చేశాడు. దీంతో మహేష్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు శ్రీముఖి సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి మిగతా వారికి మధ్య ఎలాంటి చిచ్చు పెట్టాడు. మరి ఈ టాస్క్ తరువాత ఇంటిసభ్యులు ఎలా ప్రవర్తిస్తారో చూడాలి.


హౌస్‌మేట్స్‌కు దసరా రోజున సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. దీంతో హౌస్‌లో సందడిగా గడిచింది. ఇంటి సభ్యులందరి చేత ఆటలాడించిన నాగ్.. ప్రత్యేక బహుమతులను అందించాడు. స్టార్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచిన వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ డిన్నర్‌ను ఆఫర్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa