ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తున్న బ్యూటిఫుల్‌-ట్రిబ్యూట్‌ టు రంగీలా

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 01:22 AM

సూరి, నైనా జంటగా నటించిన చిత్రం బ్యూటిపుల్‌. ట్రైల‌ర్ కుర్ర‌కారుని క‌ట్టి ప‌డేస్తోంది.  ట్రిబ్యూట్‌ టు రంగీలా అనేది ఉపశీర్షికతో విడుద‌లైన ఈ చిత్రానికి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు ప‌నిచేసిన అగస్త్య మంజు దర్శకుడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌పై టి.నరేష్‌కుమార్‌, శ్రీధర్‌ లతో కలిసి రాంగోపాల్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఇటీవ‌లే చిత్రీకరణ పూర్తి చేసుకుని లేబ్ వ‌ర్క్‌లో ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల  చేయ‌గా యూట్యూబ్‌లో ఊహించ‌న‌ని లైకులు ప‌డుతున్నాయి.  గ‌తంలో వ‌ర్మ తీసిన రంగీలా సినిమా త‌ర‌హాలోనే అగస్త్య కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అస‌లు ఈ సినిమాకు  ట్రిబ్యూల్‌ టూ రంగీలా అని ట్యాగ్ ఎందుకు పెట్టారో  చెప్పక‌నే ట్ర‌యిల‌ర్‌లోచెప్పేసిన‌ట్టుంద‌ట‌. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. కుర్ర‌కారు ఈ సినిమా విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నార‌న‌టానికి ట్రైల‌ర్‌కివ‌స్తున్న లైకులే న‌ని, ఇది మ‌రింత ఉత్సాహం ఇస్తోందంటున్నారు.   నిర్మాతలు. మ‌రి ఈ బ్యూటిఫుల్ రంగీలా స్ధాయిలో యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిద్దాం. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa