నరసింహారెడ్డి ప్రియురాలిగా, స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసే నృత్యకారిణిగా నటించి మెప్పించిన నటి తమన్నాకు నిర్మాత రామ్ చరణ్ కానుక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ వేదికగా తెలిపారు. తమన్నా చేతి వేలికి రింగులాంటి బాటిల్ ఓపెనర్‌ను వేసుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత దీనిపై తమన్నా కూడా స్పందించారు. ఆ కానుకతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయన్నారు. చెర్రీ ఇచ్చిన బహుమతి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తూ పలు ఆంగ్ల వెబ్‌సైట్లు వార్తలు రాశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa