ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు వారాలైన 'సైరా' జోరు ఇంకా తగ్గలేదు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2019, 04:00 PM

మెగా స్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా' విడుదలై  రెండు వారాలు కావస్తుంది. ఈనెల 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైన సైరా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. దసరా సెలవులలో మెరుగైన వసూళ్లు అందుకున్న ఈ చిత్రం సెలవుల అనంతరం కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించడం గమనార్హం. నిన్న శుక్రవారం కూడా సైరా తెలుగురాష్ట్రాలలో 2.10 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికే దాదాపు 92కోట్ల షేర్ వసూళ్లు సాధించిన సైరా వచ్చే శని, ఆదివారాలలో 100కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని చేరే అవకాశం కనబడుతుంది.


ఇక ఉత్తరాంధ్ర నైజాం ఏరియాలలో సైరా లాభాలు పంచే దిశగా సాగుతుంది. సుదీర్ఘ విరామం తరువాత 150 ఖైదీ చిత్రంతో 100కోట్లు సాధించిన చిరు సైరా చిత్రంతో మరోమారు ఆ ఫీట్ ని సాధించనున్నారు. ఇక చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాంతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయగా, నయనతార, తమన్నా ఆయన సరసన నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa