ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంజు అద్భుతంగా నటించావు : కమల్ హస్సన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 02:50 PM

తమిళ స్టార్ నటుడు  ధనుష్.. మంజు వారియర్ జంటగా నటించిన అసురన్ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ధనుష్, మంజు నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ సినిమాను చూసిన విశ్వ నటుడు కమలహాసన్, శ్రుతిహాసన్‌లు కూడా  ఈ సినిమాపై  ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు మంజును స్వయంగా కమల్ తమ ఇంటికి ఆహ్వానించి అభినందించారు. అద్భుతంగా నటించావంటూ ఆకాశానికెత్తేశారు. మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని ఈ సందర్భంగా కమల్ కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa